శంకరంబాడి సుందరాచారి గారు వ్రాసిన "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" గీతం మన రాష్ట్రానికి జాతీయ గేయం లాంటిది. ఈ రోజు ఎందుకో ఆ గేయాన్ని ఒకసారి పాడుకోవాలనిపించింది .
మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం ,నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి ......
Wednesday, August 18, 2010
Wednesday, August 11, 2010
Thursday, August 5, 2010
"మణిశర్మ" గారి చిత్రాల వివరాలు
నేడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి సంగీత దర్శకుడుగా వెలుగొందుతున్న "మణిశర్మ" గారి మొత్తం చిత్రాల వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా పొందవచ్చు.
Friday, July 30, 2010
Thursday, July 29, 2010
Wednesday, July 28, 2010
Sunday, July 25, 2010
Making of Magadheera Part 1/5
78 సంవత్సరాల తెలుగు సిని చరిత్రలో కనివిని ఎరుగని రికార్డులు సృష్టించిన "మగధీర" చిత్ర నిర్మాణ విశేషాలు వీడియో రూపంలో మీ కోసం
Thursday, July 22, 2010
కళాతపస్వి విశ్వనాధ్ గారికి ఇది తగునా
ప్రఖ్యాత దర్శకులు కె.విశ్వనాద్ గారి నూతన చిత్రం "శుభప్రదం" చిత్రానికి కథానాయికగా తెలుగు అమ్మాయి దొరకలేదని పరాయి బాష అమ్మాయిని ఎన్నుకున్నారు. తెలుగుదనానికి, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రాముఖ్యం ఇచ్చే అంతటి దర్శకులు కూడా తెలుగమ్మాయి లేరని చెప్పడం విడ్డురంగా ఉంది.
Tuesday, July 20, 2010
నాకు బాగా నచ్చిన ఆంగ్ల కవిత
నాకు తెలుగు మరియు ఆంగ్లములో కవితలు వ్రాయడం హాబి. ఆంగ్లములో నేను వ్రాసిన అన్ని కవితలలో నాకు బాగా నచ్చిన కవిత ఇది
Dear
If you don't near
I feel fear
and my eyes drop tear
so you come here
I am waiting from one year
Monday, July 19, 2010
హాస్య కవిత
నేను వ్రాసిన ఈ హాస్య కవిత ఎలా వుందో చెప్పండి
కిందటి వారం
మార్చాను నా అలంకారం
దాంతో మారింది నా అవతారం
అది చూపించాలని ఎక్కాను గోపురం
జనం తో నిండిపోయింది మా ఊరి మందిరం
నన్ను చూసి అన్నారు వానరం
దాంతో మొదలైంది నాలో కలవరం
తెలిసివచ్చింది నా నేరం
పరుగు తీసాను బహు దూరం
ఇట్లు
సుందరం
ఉరు రంగాపురం
కిందటి వారం
మార్చాను నా అలంకారం
దాంతో మారింది నా అవతారం
అది చూపించాలని ఎక్కాను గోపురం
జనం తో నిండిపోయింది మా ఊరి మందిరం
నన్ను చూసి అన్నారు వానరం
దాంతో మొదలైంది నాలో కలవరం
తెలిసివచ్చింది నా నేరం
పరుగు తీసాను బహు దూరం
ఇట్లు
సుందరం
ఉరు రంగాపురం
Sunday, July 18, 2010
Saturday, July 17, 2010
మీ కీబోర్డ్ లో రుపీ ఫాంట్ కావాలా?
మన రూపాయికి కొత్త రూపం వచ్చింది. అది మీరు పొందాలనుకుంటే ముందుగా http://blog.foradian.com/ అనే బ్లాగును ఓపెన్ చేయండి. తరువాత సైట్ నుండి Rupee Foradian.ttf ను డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ప్యానెల్ లోని ఫాంట్స్ ఫోల్డర్ లో ఈ రూపీ ఫాంట్ ను పేస్ట్ చేసుకోవాలి. MS WORD తెరిచి ఫాంట్ ఫోల్డర్ లో రూపీ ఫాంట్ ను ఎన్నుకోవాలి. ఆ పైన ట్యాబ్ కీ పైన వుండే టిల్డ్ కీ (~) నొక్కితే రుపీ ఫాంట్ వస్తుంది.
Subscribe to:
Posts (Atom)