Sunday, May 20, 2012

రిజర్వేషన్ నా కొంప ముంచింది

బ్యాంక్ ఉద్యోగం నా జీవిత కల. అనేక బ్యాంక్ పరీక్షలు వ్రాశాను. కాని ఎందులోను ప్రవేశార్హత సాధించలేకపోయాను. ఇంతలో 19 బ్యాంకులకు కలిపి ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. అప్పుడే నేను 30 వ సంవత్సరములోకి అడుగు పెట్టాను. సో ఈ పరీక్షలో ఉత్తీర్ణత కావడం నాకు లైఫ్ అండ్ డెత్ లాంటిది. ఎందుకంటే ఇది పోతే ఇక ఎప్పటికీ బ్యాంక్ పరీక్ష వ్రాయలేను. దానికోసం ఉన్న ఉద్యోగాన్ని  వదులుకుని ప్రిపేర్ అయ్యాను. రాత్రింబవళ్ళు కష్టపడ్డాను. కాని రిజల్ట్స్ వచ్చాక నేను షాక్ అయ్యాను.
అన్నింట్లో మంచి మార్కులు వచ్చిన నాకు ఇంగ్లీషులో 24 కు గాను 21 మార్కులు వచ్చాయి. నేను జనరల్ కేటగిరికి చెందినందున కనీస మార్కులు 24, మిగిలిన కులాల వారికి 21 మార్కులు నిర్ణయించారు. దాంతో నా జీవిత కల నెరవేరలేదు. 

Saturday, April 28, 2012

అతి తక్కువ ఖర్చుతో ఫోటో ఆల్బం


ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర కెమెరా ఫోన్లు, డిజిటల్ కెమెరాలు ఉన్నాయి. వాటితో ఫోటోలు తీసుకుని సిస్టమ్‌లో కాపీ చేసుకుంటాము. నచ్చిన ఫోటోలను కడిగించుకుని ఆల్బంలో పెట్టుకుంటాము. అయితే ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలా కాకుండా కేవలం యాభై రూపాయలకే 20 పేజీల ఫోటో ఆల్బం మనకు నచ్చినట్టుగా సృజనాత్మకంగా రూపొందించుకుని పొందే అవకాశం మీ కోసం. ఇందుకు కావలసింది 


1. సిస్టం లేదా లాప్ టాప్ 
2. ఇంటర్ నెట్ కనెక్షన్ 
3. ఈ మెయిల్ ఐడి
4. మొబైల్ నెంబర్


మరిన్ని వివరాలకు మీ మెయిల్ ఐడిని పోస్ట్ చెయ్యండి.

Friday, April 20, 2012

భీష్మ... ఒక అద్భుత దృశ్య కావ్యం

భీష్మ చిత్రం విడుదలై నిన్నటితో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్రం గురించి ఒక ప్రత్యేక వ్యాసం ఈనాడు పత్రికలో వ్రాశారు. అదే విధంగా ఆ చిత్రం గొప్పతనం గురించి అన్ని న్యూస్ చానళ్లలొ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసారు. దాంతో ఆ చిత్రాన్ని చూడాలన్న కోరిక నాలో కలిగింది. ఆ చిత్రాన్ని ఈటీవీలొ చూసిన తర్వాత నిజ్జంగా నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంతటి అద్భుత చిత్రాన్ని అందించిన ఆ చిత్ర దర్శక నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు హృదయ పూర్వక కృతఙతలు. 

Wednesday, August 18, 2010

మా తెలుగు తల్లికి మల్లెపూదండ,

శంకరంబాడి సుందరాచారి గారు వ్రాసిన "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" గీతం మన రాష్ట్రానికి జాతీయ గేయం లాంటిది. ఈ రోజు ఎందుకో ఆ గేయాన్ని ఒకసారి పాడుకోవాలనిపించింది .


మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం ,నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి ......

Thursday, August 5, 2010

"మణిశర్మ" గారి చిత్రాల వివరాలు


నేడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి సంగీత దర్శకుడుగా వెలుగొందుతున్న "మణిశర్మ" గారి మొత్తం చిత్రాల వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా పొందవచ్చు. 

http://en.wikipedia.org/wiki/Mani_Sharma