Sunday, May 20, 2012

రిజర్వేషన్ నా కొంప ముంచింది

బ్యాంక్ ఉద్యోగం నా జీవిత కల. అనేక బ్యాంక్ పరీక్షలు వ్రాశాను. కాని ఎందులోను ప్రవేశార్హత సాధించలేకపోయాను. ఇంతలో 19 బ్యాంకులకు కలిపి ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. అప్పుడే నేను 30 వ సంవత్సరములోకి అడుగు పెట్టాను. సో ఈ పరీక్షలో ఉత్తీర్ణత కావడం నాకు లైఫ్ అండ్ డెత్ లాంటిది. ఎందుకంటే ఇది పోతే ఇక ఎప్పటికీ బ్యాంక్ పరీక్ష వ్రాయలేను. దానికోసం ఉన్న ఉద్యోగాన్ని  వదులుకుని ప్రిపేర్ అయ్యాను. రాత్రింబవళ్ళు కష్టపడ్డాను. కాని రిజల్ట్స్ వచ్చాక నేను షాక్ అయ్యాను.
అన్నింట్లో మంచి మార్కులు వచ్చిన నాకు ఇంగ్లీషులో 24 కు గాను 21 మార్కులు వచ్చాయి. నేను జనరల్ కేటగిరికి చెందినందున కనీస మార్కులు 24, మిగిలిన కులాల వారికి 21 మార్కులు నిర్ణయించారు. దాంతో నా జీవిత కల నెరవేరలేదు.