Wednesday, August 18, 2010

మా తెలుగు తల్లికి మల్లెపూదండ,

శంకరంబాడి సుందరాచారి గారు వ్రాసిన "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" గీతం మన రాష్ట్రానికి జాతీయ గేయం లాంటిది. ఈ రోజు ఎందుకో ఆ గేయాన్ని ఒకసారి పాడుకోవాలనిపించింది .


మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం ,నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి ......

Thursday, August 5, 2010

"మణిశర్మ" గారి చిత్రాల వివరాలు


నేడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి సంగీత దర్శకుడుగా వెలుగొందుతున్న "మణిశర్మ" గారి మొత్తం చిత్రాల వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా పొందవచ్చు. 

http://en.wikipedia.org/wiki/Mani_Sharma