Tuesday, August 26, 2025

హమ్మయ్య నా బ్లాగ్ ఇంకా ఉంది

 ఎపుడో 2010 వ సంవత్సరం జూలై నెలలో నా పుట్టిన రోజైన 17 వ తేదీన ఈ బ్లాగును ప్రారంభించినాను. కొన్ని పోస్టులు కూడా వ్రాశాను. తరువాత ఉద్యోగం హడావుడిలో పడి దీని సంగతి పూర్తిగా మరచిపోయాను. మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చి లాగిన్ చూస్తే ఇంకా అలానే ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ప్రతిరోజూ ఒక బ్లాగ్ వ్రాయాలని నిశ్చయించుకున్నాను. ఏమి వ్రాయాలి, దేని గురించి వ్రాయాలి, అని ఇంకా ఏమి అనుకోలేదు. అలాగే నా తోటి తెలుగు బ్లాగర్లను, వాళ్లు రాసే బ్లాగును, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నాను.